ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య..!!

0
143

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో నిహారిక(26) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతోసహా ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులపై కిరోసిన్‌ పోసి, తానూ నిప్పంటించుకొని ఈ దారుణ ఘటనకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెతో పాటు కూతురు మణిదీప్తి(4), కుమారుడు కేదారినాథ్‌(2) మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కొల్లాపూర్‌ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై మురళీగౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకునేలోపే మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మృతురాలి భర్త మహేశ్‌ పెంట్లవెల్లి మండల కేంద్రంలో మొబైల్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

SHARE

LEAVE A REPLY