500 ల ఎకరాల అసైన్డ్ భూములు దోచుకున్నారు. – ధర్మాన ప్రసాదరావు

0
89

Times of Nellore (Visakha) –కోట సునీల్ కుమార్ : విశాఖ జిల్లా మధురవాడలోని సుమారు 500 ల ఎకరాల అసైన్డ్ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులు దోచుకున్నారని మాజీ మంత్రి,యైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కుంభకోణం‌ లో సిటింగ్ జడ్జి తో విచారణ జరపాలని,ప్రస్తుతం సిట్ మీద ఎవరికీ నమ్మకం లేదని ధర్మాన.ప్రసాదరావు అన్నారు. భూ కుంభకోణం‌ లో నా ప్రమేయం ఉన్నట్లు అధికార ప్రభుత్వం నా పై బురద జల్లి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ధర్మాన తెలిపారు. భూ కుంభకోణం వ్యూహం ప్రకారం దోపిడీ చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఈ స్కాం లో అసలు వ్యక్తి ఎవరో బయటపెట్టాలని అన్నారు. అధికార పార్టీ నాయకులు యసైన్డ్ భూముల ను దోచుకున్న కుంభకోణం పై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని,11రోజుల్లో ఇన్వెస్టిగేషన్ ఫైల్ కదిలింది అంటే దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని స్పష్టమైనప్పటికీ ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి సిట్ విచారణ లో తన పేరు రావడం పై ధర్మాన అభ్యంతరం తెలిపారు.

SHARE

LEAVE A REPLY