ఈ 15 నెలల్లో మీరు సాధించిందేంటి?:

0
80

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఈ 15 నెలల వైసీపీ పాలనలో సాధించిందేంటి? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ‘జగన్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా గండికోట నిర్వాసితులకు పరిహారం అందించలేదు. చంద్రబాబు ప్రభుత్వం గండికోట ప్రాజెక్ట్‌లో 12 టీఎంసీలు నిల్వచేసి 19 టీఎంసీల వరకు రైతులకు అందించింది. ఆనాడు నీటిని నిల్వచేయకుండా ఉండటం కోసం జగన్ నిర్వాసితులను రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసిన జగన్.. గండికోట నిర్వాసితులకు డబ్బులెందుకు ఇవ్వలేదు? 15 నెలల్లో కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను పండబెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసిందో వాటి నిర్మాణానికి ఎంత ఖర్చుచేసిందో చెప్పగలదా? కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాల్సి వస్తుందని రాయలసీమకు నీళ్ళు ఆపేస్తారా? ఉచిత విద్యుత్ పథకానికి మంగళంపాడి కేవలం అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. రైతాంగం ఇబ్బందులలో ఉంటే వారికి రుణాలు అందకుండా చేసి సున్నా వడ్డీ పథకంలో వారికి సున్నా చుట్టారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. ప్రజల తరుపున బాధ్యత గల వారిగా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక లారీలతో తొక్కిస్తామని బెదిరిస్తారా?’ అంటూ దేవినేని ఉమ ధ్వజమెత్తారు.

SHARE

LEAVE A REPLY