సైకిలెక్కిన దేవినేని – పుట్టింటికి వచ్చినట్లుందని వ్యాఖ్య

0
680

Times of Nellore – విజయవాడ రాజకీయాల్లో గత కొంతకాలంగా అందర్నీ ఊరిస్తున్న అంశానికి ఎట్టకేలకు తెరపడింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని నెహ్రూ తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆయన కూమారుడు దేవినేని అవినాష్ కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావ్ తో కలిసి చంద్రబాబును కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా భావిస్తున్నాని అన్నారు. నాకు రాజకీయ భవిష్యత్‌ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇదోక శుభపరిణామంగా భావిస్తున్నా. రాజధాని నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా. అవినాష్‌కు కొంతవరకు బాధ ఉన్నా.. నాతో పాటు పార్టీలో చేరాడు, అని వివరించారు.

ఖాళీ అయిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి
దేవినేని అవినాష్ తండ్రితో కలిసి తెలుగుదేశంలో చేరడంతో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే దాన్నిఎవరితో భర్తీ చేస్తారనేది సందిగ్ధంగా ఉంది. ఎస్సీ సామాజిక వర్గంతో దాన్ని భర్తీ చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్, మాజీ మంత్రి శైలజానాథ్ భావిస్తున్నారు. అయితే ఎస్సీ సామాజిక వర్గంతో కాకుండా మరో ప్రత్యామ్నాయం చూసే క్రమంలో ఇప్పటికే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నెల్లూరుజిల్లాకు చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ని అధ్యక్ష పదవిలో నియమించే అవకాశం ఉంది. అయితే ఈ నియమాకాలన్నీ పూర్తయ్యే సరిగా కనీసం మూడు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం .

SHARE

LEAVE A REPLY