దేవరగట్టు కొండ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకల్లో నలుగురి పరిస్థితి విషమం…!

0
56

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – దేవరగట్టు కొండలో వెలసిన మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఈ కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీ గా వస్తోంది .స్వామి అమ్మ వారి విగ్రహాల కోసం కర్రలతోయుద్ధం జరిగింది. ఈ ఉత్సవంలో కొందరి తలలు పగిలాయి మరికొందరికీ కాళ్లు చేతులు విరిగాయి రక్తం తో నేల తడిసిపోయింది. దాదాపు వెయ్యి మంది పోలీసులు ఆయుధాలతో గస్తీ కాస్తున్న వాటిని లెక్కచెయ్యలేదు ఆ ప్రాంత పజలు. ఏటా జరిగే తంతే అనుకుంటూ కర్రల సమరానికి సై అన్నారు. ప్రతి ఏటా విజయ దశమి రోజు దేవరగట్టులో బన్ని ఉత్సవాలు సాంప్రదాయబద్దంగా జరుగుతాయి. మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం తర్వాత స్వామి వారిని ఊరేగిస్తారు అలా కొండ దిగువ నున్న సింహాసన కట్టకు చేరుస్తారు అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆచారం లో భాగంగా ఉత్సవ మూర్తులను తమ వశం చేసుకునేందుకు పదకొండు గ్రామాల ప్రజలు కర్రల యుద్ధానికి దిగుతారు.

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవం మరోసారి రక్తసిక్తంగా మారింది. వేలాది కన్నీళ్లు పోటీపడ్డాయి. కాగడాల గాల్లో ఎగిరి పడ్డాయి. తలలు పగిలి రక్తం చిందింది. స్వామి అమ్మ వారి విగ్రహాల కోసం పదకొండు గ్రామాల మధ్య జరిగిన సమయంలో అరవై నాలుగు మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆదోని, ఆలూరు, కర్నూ లు ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు. కొంతమంది కర్రలు మరికొందరు దివిటీలు చేత బట్టి అర్ధ రాత్రి వేళ కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరుతారు. ఇదే సమయంలో ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీపడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రల తో తలపడతారు. రక్తపాతంగా మారుతున్న కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు ప్రతిసారీ పోలీసులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సారి కూడా దాదాపు వెయ్యి మంది పోలీసులతో భద్రత ను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు యాభై చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.మొలలు ఉన్న కర్రలు అనుమతించలేదు. అయితే చివరికి లక్ష మంది పాల్గొన్న ఉత్సవంలో వెయ్యి మంది పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఎప్పటిలానే ఏడాది ఉత్సవం లోనూ ఎలాంటి హింస జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా స్థానికు లు రెండు వర్గా లుగా విడిపోయి కర్రలు యుద్ధాని కి దిగారు. స్వామి అమ్మ వారి విగ్రహాల కోసం రెండు గ్రామాల మధ్య జరిగిన సమయంలో అరవై నాలుగు మందికి గాయాలయ్యాయి మరియు నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

దేవరగట్టు లో హింస చెలరేగకుండా ఉండేందుకు కర్రల సమరం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని గత నెల రోజులుగా అవగాహన సదస్సుల ద్వారా చేస్తున్న చైతన్యం ప్రజల్లో తెస్తున్నామని పోలీసులు తెలియజేశారు.కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు అన్నది ఈ గొడవలో మరోసారి తేలిపోయింది. ఈ ఆచారం ఇంకా ఎన్ని తరాలు ఇలా కొనసాగుతుంది అనేది వేచి చూడాలి.

SHARE

LEAVE A REPLY