ఉత్తరాంధ్రకు తప్పిన పెను తుఫాన్ ముప్పు

0
176

Times of Nellore (Visakha)  # కోట సునీల్ కుమార్ #  – ప్రచండ వేగంతో దూసుకొస్తున్న ఫొని తుపాను ఆంధ్రప్రదేశ్‌ను దాటడంతో ఉత‍్తరాంధ్రకు ముప్పు తప్పింది. తుపాను శ్రీకాకుళం జిల్లాను దాటినా, దాని ప్రభావం 30 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఫొని తుపాను ప్రస్తుం పూరికి 40 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం లేదా మధ్యాహ్ననికి పూరికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ, క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుంది. తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీయనున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో 60 నుంచి 115 కిమీ వరకూ పెనుగాలులు వీచే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ మాట్లాడుతూ…ఫొని తుపాన్‌ జిల్లాను దాటిందని, కంచిలి
మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. ఇచ్చాపురం మండలంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని, సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను తరలించినట్లు వెల్లడించారు. ఇచ్ఛాపురంలో మూడు ఇళ్లు మినహా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. విద్యుత్‌ స్తంభాలు కొన్ని దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని, వాటిని తక్షణమే పునరుద్ధరణ చేస్తామన్నారు.

SHARE

LEAVE A REPLY