కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఇద్దరు మృతి

0
98

Times of Nellore (Mumbai)# కోట సునీల్ కుమార్ #-  ముంబైలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. చత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, సుమారు 25మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నావారిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం బాగా బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY