నితిన్ సినిమా షూటింగ్ మొదలైపోయింది !!

0
27

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ఈ ఏడాది ‘భీష్మ’ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న నితిన్ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ‘రంగ్ దే’ సినిమా ను పట్టాలెక్కించాడు . ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత నితిన్ తన నెక్స్ట్ సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తో కలిసి ఈసినిమాను భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవల `చెక్` అనే టైటిల్ ని ఫైనల్ చేయగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల టైటిల్ సహా ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా వారియర్హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇదని నితిన్ నటన అద్భుతంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. శుక్రవారం ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నితిన్ సెట్స్లోక ఎంటరయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్ లలో ‘లాక్ డౌన్ టు లాకప్’ అనే ఒక పోస్టర్ ను పంచుకున్నాడు.

SHARE

LEAVE A REPLY