చంద్రయాన్-2 ను బాహుబలి అని పేరు పెట్టడం గౌరవంగా ఉంది.

0
157

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా గుర్తుంచుకుంటారని జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రయాన్-2 రాకెట్ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా మన దేశాన్ని అగ్రదేశాల జాబితాలో నిలిపిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరపున, జనసైనికుల తరపున అభినందనలు తెలిపారు పవన్.

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతీయులు గర్వపడుతున్నారని’ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇస్రో శాస్ర్తవేత్తలను ప్రభాస్ విష్ చేశారు. చంద్రయాన్-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకానికి బాహుబలి అని పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నాను.. అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 300 వందల టన్నుల బరువైన చంద్రయాన్-2ను ప్రయోగించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఇస్రో యూనిట్.. బాహుబలి చిత్ర యూనిట్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైమైనా మొత్తానికి చంద్రయాన్-2తో భారతీయ ఖ్యాతి మరింత పెరిగిందనే చెప్పాలి.

SHARE

LEAVE A REPLY