చంద్రబాబు ప్రెస్ మీట్

0
75

Times of Nellore (Amaravati)  # కోట సునీల్ కుమార్ # – పోలింగ్‌ రోజు (11వ తేదీ) ఉదయం 9 గంటల సమయానికి 30 శాతానికిపైగా ఈవీఎంలు పనిచేయలేదని, అసలు ఈ దేశంలో ఎన్నికల సంఘం ఉందా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సీఈవో ద్వివేది తన ఓటు వేసుకోలేక వెనక్కి వచ్చారని అన్నారు. ఇంత అసమర్థ నిర్వహణ ఎక్కడైనా ఉంటుందా? అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించి.. అనవసర బదిలీలు చేసి రాజకీయాలు చేయడంలో ఈసీ ముందుందని ఎద్దేవా చేశారు.

కనీస ఏర్పాట్లు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించడం మాత్రం ఎన్నికల కమిషన్‌కు చేతకాలేదని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల రోజు మధ్యాహ్నానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. తాను వీడియో విడుదల చేసిన తర్వాత ఓటర్లు అనూహ్యంగా స్పందించారని అన్నారు. భారీ స్థాయిలో ఓటర్లు క్యూ లైన్లలో నిలబడ్డారని అన్నారు. అలాంటి వారిని కూడా ఈసీ తీవ్ర అవస్థలపాలు చేసిందని, ఇంత అస్థవ్యస్థ పాలనకు ఎవరు బాధ్యులని చంద్రబాబు ప్రశ్నించారు.

SHARE

LEAVE A REPLY