నేడు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం

0
158

Times of Nellore (Amaravti) #కోట సునీల్ కుమార్ #  – ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం ఎక్కడ విఫలమైంది..? ఎక్కడ తప్పులు జరిగాయి..? అని తెలుగు తమ్ముళ్లు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నేడు చంద్రబాబు నివాసంలో 11 గంటలకు ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, నూతన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై నిశితంగా చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించే అవకాశం ఉంది. కాగా.. ఈ నెల 15న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో బాబు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం టీడీఎల్పీ.. సాయంత్రం ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా.. బుధవారం నాడు టీడీపీ ఎంపీలతో బాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

SHARE

LEAVE A REPLY