ఎంత దూరమైనా వెళ్తాం – చంద్రబాబు

0
84

Times of Nellore (Delhi)  # కోట సునీల్ కుమార్ #- కేంద్రానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలను పట్టుకుంటే గెలవొచ్చని మోదీ అనుకుంటున్నారని.. తెలుగువారి సత్తా.. ప్రజల నాడి తెలియని వ్యక్తి అన్నారని విమర్శించారు. మోదీ ధర్మాన్ని పాటించే వ్యక్తయితే గుంటూరుకు వచ్చి విమర్శించరని.. విభజన గాయాన్ని ఇంకా పెద్దగా చేసి కారం చల్లి సంతోషిస్తున్నారని.. ఇది నీచం..పరమ దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఆంధ్రా భవన్‌లో ధర్మపోరాట దీక్ష చేస్తున్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికైనా మూడు రోజుల టైముంది.. ఇది తప్పని పార్లమెంటులో అంగీకరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారు.. చేయకపోతే ఏపీ ప్రజానీకం శాశ్వతంగా బీజేపీని బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఏపీలో బీజేపీకి పూర్తిగా తలుపులు మూసుకుపోతాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేవరకు ఈ పోరాటం ఆగదు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారు. మేము కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఢిల్లీకి రావాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. నిన్న గుంటూరు వచ్చారు.. ప్రత్యేక హోదాపై మాట్లాడారా? ఏపీలో అడుగుపెట్టే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా? అనుకున్నది సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం’’ అంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

SHARE

LEAVE A REPLY