ఆ ముగ్గురు ఏం చేస్తారో చూడాలి: రాఘవులు

0
158

Times of Nellore (Visakha) #కోట సునీల్ కుమార్ #  – ఎన్డీయే ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సీపీఎం జాతీయ నాయకులు రాఘవులు అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అభిప్రాయపడ్డారు. గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నవారు ఇప్పుడు విడిగా పోటీ చేశారని పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాంతీయ పార్టీలన్నీ ఒకతాటిపైకి వచ్చి కేంద్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ప్రాంతీయ పార్టీల మధ్య కొంత వైవిధ్యాలు ఉన్నాయన్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉంటే బలం.. కలవకపోతే బలహీనత అంటూ ఉండదన్నారు. బీజేపీ మతన్మోద పార్టీ అని, మిగిలినవి లౌకికవాద పార్టీలని పేర్కొన్నారు. బీజేపీని నిరోధించే లక్ష్యంగా లౌకికవాద పార్టీలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారత రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేసే శక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉందన్నారు. ఈ రాష్ట్రాలకు చెందిన చంద్రబాబు, జగన్, కేసీఆర్‌లు ఆ పాత్ర నిర్వహిస్తారో లేదో చూడాలన్నారు. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేశామన్న రాఘవులు.. ఎన్ని సీట్లు గెలుస్తామనేదానిపై ఊహాగానాలు చేయటం లేదన్నారు.

SHARE

LEAVE A REPLY