బ్లాక్‌ను వైట్‌గా చేసేందుకు బడా ప్లాన్: తెర వెనుక ఎత్తుగడల్లో బడా కంపెనీలు!

0
793

Times Of Nellore ( Andhra Pradesh ) – రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటన అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో అక్రమార్జనను పోగేసుకున్న చాలావరకు కంపెనీలు వాటిని ఎలా రూట్ మళ్లించాలా అన్న ఆలోచనలో పడ్డాయి. బ్లాక్ ను వైట్ గా మార్చుకునేందుకు అనువుగా ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదులుకోవద్దనే యోచనలో కంపెనీలున్నాయి. ఇందుకోసం తెరవెనుక ఎత్తుగడల్లో నిమగ్నమైన పోయిన బడా కంపెనీలు తమ ఉద్యోగులను పావుల్లా వాడుకుని ఈ సంకటం నుంచి గట్టెక్కాలని భావిస్తున్నాయి. తమ ప్లాన్ లో భాగంగా కంపెనీకి విధేయులైన, అత్యంత నమ్మకస్తులైన ఉద్యోగులను బినామీలుగా మార్చుకునేందుకు ఆయా కంపెపనీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన ఓ బడా కంపెనీ తమ కంపెనీ ఉద్యోగియైన ఒకరికి రూ.7లక్షలు ఇచ్చి తన ఖాతాలో వేసుకోవాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే నగరానికే చెందిన ఓ క్లబ్బులోను ఇలాంటి వ్యవహారమే నడుస్తున్నట్టుగా సమాచారం. క్లబ్బుకు వచ్చే చాలామంది బడా బాబులు.. అక్కడ పనిచేసే సిబ్బందిని తమ బినామిలుగా మార్చుకుని, తమ డబ్బును వారి ఖాతాల్లో భద్రంగా దాచుకోవాలని జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు బినామీల వేట పడిపోయారు బడా బాబులు.

SHARE

LEAVE A REPLY