చంద్రబాబు గురించి బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యలు

0
127

Times of Nellore (Visakha) #కోట సునీల్ కుమార్ # – ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేకత జగన్‌కు కలిసొచ్చే అంశంగా కనబడుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాకపోతే బలోపేతం అయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు. కచ్చితంగా తెలంగాణలో బలోపేతం అవుతామని వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప.. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. మే 23 తర్వాత ఏం చేస్తామనేది స్పష్టంగా చెబుతామన్నారు.

SHARE

LEAVE A REPLY