దర్శకుల సంఘం అధ్యక్షుడిగా భారతీరాజా

0
77

Times of Nellore (Chennai) – తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ దర్శకుల కోసం తమిళ దర్శకుల సంఘంను నెలకొల్పిన విషయం తెలిసందే. ఈ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా దర్శకుడు విక్రమన్, కార్యదర్శిగా ఆర్‌కే.సెల్వమణి, కోశాధికారిగా పేరరసు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా వీరి కాల పరిమితి పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఈ సంఘ కార్యవర్గ సమావేశాన్ని సోమవారం స్థానిక వడపళిలోని ఒక ప్రైవేట్‌ సినీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు విక్రమన్‌ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో ఈ పదవికి సీనియర్‌ దర్శకుడు భారతీరాజాను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక మిగిలిని పదవులకు త్వరలోనే ఎన్నికలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY