విజయకీలాద్రిపై వైభవంగా బ్రహ్మోత్సవాలు

0
227

Times of Nellore (Tadepalli) # కోట సునీల్ కుమార్ # – తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ద్వితీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చక స్వాములు ఆలయ ధ్వజస్తంభం వద్ద గరుడ పతాకాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకస్వామి మధుసూదనాచార్యులు వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు.

వివిధ రకాల పుష్పాలు, పట్టువస్త్రాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చిన జీయర్‌స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేసి, తీర్ధ గోష్ఠి నిర్వహించారు. అనంతరం జీయర్‌స్వామి ప్రతిష్ఠాత్మక గోపాలోపాయన పురస్కారాన్ని, కర్ణాటక రాష్ట్రం మేల్కొట ప్రాంతానికి చెందిన ఎన్‌ఏ లక్ష్మీతాతాచార్య స్వామికి చిన జీయర్‌స్వామి అందజేసి సత్కరించారు. జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, రఘునాధచార్యులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY