బాహుబలి సినిమా సెట్టింగ్‌ల తరహాలోనే – రాజధాని

0
809

Time of Nellore ( hyderabad ) – బాహుబలి సినిమా సెట్టింగ్‌ల తరహాలోనే రాజధానిలో భవనాల కోసం కూడా సలహాలివ్వాలని సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ విజ్ఞప్తి చేశారు. రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన సీఎం వెంటనే రాజమౌళిని కలసి సలహాలు తీసుకోవాలని ఇటీవల మంత్రి నారాయణను ఆదేశించారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా తగు సలహాలు ఇవ్వలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ రాజమౌళిని కోరారు.
ఈ మేరకు మంత్రి నారాయణ, శ్రీధర్‌లు.. అపాయింట్‌మెంట్‌ తీసుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రాజమౌళితో భేటీ అయ్యారు. వారిచ్చిన డిజైన్లు చూసిన రాజమౌళి తన అభిప్రాయాలను చెప్పి, మరోసారి కలుద్దామని పంపించినట్లు తెలిసింది.

SHARE

LEAVE A REPLY