అయ్యప్ప ఆలయానికి వెళ్లిన ఆ ఇద్దరు ఎక్కడ?

0
95

Times of Nellore (Tiruvanantapuram)  # కోట సునీల్ కుమార్ #- సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి తొలిసారి ప్రవేశించి చరిత్ర సృష్టించిన బిందు, కనకదుర్గలు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఆందోళనకారుల నుంచి బెదిరింపులు వస్తుండడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన తర్వాత వారు ఇప్పటి వరకూ ఇంటికి వెళ్లలేదు. ఈ ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లినట్లు తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో సమాచారం కూడా లేదు. అయితే తమకు పోలీసులపై నమ్మకం ఉందని, రక్షణ కల్పిస్తారని విశ్వసిస్తున్నామని వారు గుర్తుతెలియని ప్రదేశం నుంచి మీడియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఇంటికి వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 50ఏళ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆందోళనకారులు మహిళల ప్రవేశాన్ని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. అయితే ఆ తీర్పు తర్వాత బిందు(40), కనకదుర్గ(39)లు అయ్యప్ప గుడిలోకి వెళ్లిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు.

SHARE

LEAVE A REPLY