అశోక్ బాబు ఉద్యోగ విరమణ

0
77

Times of Nellore (Amaravati) # కోట సునీల్ కుమార్ # – ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌ పి.అశోక్‌బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే బహిరంగంగా ఆయనకు పిలుపిచ్చారు. త్వరలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక స్థానాన్ని ఈయనకు కేటాయించే అవకాశముందంటున్నారు. ఆయన ఉద్యోగ విరమణ చేయడంతో ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఎన్జీవోల ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఈ రెండు బాధ్యతలూ చేపట్టనున్నట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో ఎన్జీవోల సంఘం కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో గురువారం పదవీవిరమణ చేసిన అశోక్‌బాబుకు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు.

SHARE

LEAVE A REPLY