నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం!!

0
65

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒కరోనాకు గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న టాలీవుడ్ స్టార్ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటిన్‌ని వైద్యులు విడుదల చేశారు. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న జీవితా రాజశేఖర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా రాజశేఖర్ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. అందులో రాజశేఖర్ తనయలు శివాత్మిక, శివాని త్వరగానే ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు.

SHARE

LEAVE A REPLY