23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

0
154

Times of Nellore (అమరావతి)# కోట సునీల్ కుమార్ #: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలిపింది. రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నియామక ప్రకటన జారీ చేసింది. ఈనెల 12 నుంచి జనవరి 2వరకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జులై 1 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులని ఏపీపీఎస్సీ తెలిపింది. మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ఆన్‌లైన్‌ పరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

SHARE

LEAVE A REPLY