ఏపీలో 3 జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం!

0
62

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. కర్నూలు జిల్లాలో పెద్దకడలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆస్పరి, దేవరకొండ, గోనెగొండలో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా జిల్లాలో విజయవాడ రూరల్, కోడూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, గుంటూరు జిల్లాలో అమరావతి, తుళ్ళూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని సూచించింది. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని స్పష్టం చేసింది.

SHARE

LEAVE A REPLY