ఏపీలో ఐటీ కలకలం.. 2వేల కోట్ల అక్రమ లావాదేవీలు!!

0
77

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలఫై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. ఇటీవల ఏపీలో టిడిపి నాయకుల సన్నిహితులపై ఐటీ దాడులు జరుపగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అకౌంట్లు లేనట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు.

ఈ నెల 6న విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేలో ఐటీ శాఖ దాడులు జరిపింది. చంద్రబాబు మాజీ పి ఎస్ శ్రీనివాస్ తో సహా మరో మూడు సంస్థలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. 25 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. బోగస్ బిల్లులతో పాటు, బోగస్ ఇన్వాయిస్ లు, బోగస్ సబ్ కాంట్రాక్టులను అధికారులు గుర్తించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధుల దారి మళ్లించినట్లు గుర్తించారు. బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు.

SHARE

LEAVE A REPLY