ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి జగన్ సర్కార్ శుభవార్త.. !!

0
61

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-ఏపీలో పింఛన్‌దారులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆగ‌స్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం పింఛన్‌దారుల‌కు నెల‌కు రూ.2,250 వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది. పింఛన్ డబ్బును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టి ఏడాది పూర్త‌ికావడంతో.. ఆగ‌ష్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు ఈ పెన్ష‌న్‌ని గ్రామ‌, వార్డు వాలంటీర్లు అందజేయనున్నారు.

SHARE

LEAVE A REPLY