ఎపిలో పలువురు ఐఎఎస్‌ ల బదిలీ.. పోస్టింగ్స్‌!

0
158

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఎపిలో పలువురు ఐఎఎస్‌ అధికారులు బదిలీతో పాటు పోస్టింగ్స్‌ ఇచ్చారు. జీఎస్‌ఆర్కే విజయ్‌కుమార్‌ కు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ తో పాటు ప్లానింగ్‌ కార్యదర్శి, సీఈవో గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సుమిత్‌కుమార్‌ కు ఎపి ఫైబర్‌ నెట్‌ ఎండీతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయల కామర్స్‌ డిపార్ట్మెంట్‌ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో పాటు ఇసుక బాధ్యతలు ప్రత్యేకంగా అప్పగించారు. ఎం.హరినారాయణ్‌ కు సీసీయల్‌ స్పెషల్‌ కమిషనర్‌తో పాటు పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు, ప్రత్యేకంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్స్‌ శిక్షణ బాధ్యతలు అప్పగించారు. వి.కోటేశ్వరమ్మ కు ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. సంజయ్‌ గుప్తా ను పీసీసీయష్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

SHARE

LEAVE A REPLY