పర్యాటకంలో తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట!

0
160

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – జాతీయ స్థాయిలో పర్యాటక రంగంలో తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. పర్యాటక రంగంలో వృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. ఉత్తమ రైల్వేస్టేషన్‌గా విశాఖకు పురస్కారం దక్కింది. ఉత్తమ కాఫీ టేబుల్‌ బుక్‌ కేటగిరీలోనూ ఏపీకి ప్రథమస్థానం లభించింది. ఇక సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించుకునే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

అడ్వెంచర్‌ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎంపికైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు. దిల్లీలోని ప్రజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పర్యాటకరంగానికి పెద్దగా ఆదరణ లేకపోయేది. కానీ ఇప్పుడు భారత్‌లో పర్యాటకులకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం లభిస్తోందని కొనియాడారు.

SHARE

LEAVE A REPLY