17న ఎపి ఎడ్‌సెట్‌ ఫలితాలు

0
142

Times of Nellore (Amaravati) #కోట సునీల్ కుమార్ # – ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విజయవాడలో ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో మే 6న 56 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 13వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

18న ఎంసెట్‌ ఫలితాలు
అలాగే, ఈ నెల 18న మధ్యాహ్నం ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు జరిగిన ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ, ఏపీల నుంచి 2,82,901మంది విద్యార్థులు హాజరయ్యారు.

SHARE

LEAVE A REPLY