ఏపీ లో తగ్గని కరోనా కేసులు… ఈ రోజు ఎన్నంటే..?

0
45

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,342 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,01,131 కి చేరింది. ఇందులో 31,469 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,63,096 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,566 కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురం లో 131, చిత్తూరులో 404, తూర్పుగోదావరి జిల్లాలో 445, గుంటూరులో 378, కడపలో 203, కృష్ణాలో 344, కర్నూలులో 60, నెల్లూరులో 98, ప్రకాశంలో 266, శ్రీకాకుళంలో 112, విశాఖపట్నంలో 244, విజయనగరంలో 106, పశ్చిమ గోదావరిలో 551 కేసులు నమోదయ్యాయి.

SHARE

LEAVE A REPLY