ఈ నెల 30 తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

0
94

Times of Nellore (Amaravati) # కోట సునీల్ కుమార్ # – రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్నాయి. ఫిబ్రవరి ఏడో తేదీ వరకూ ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ తేదీలపై అధికార వర్గాలకు ఇప్పటికే సమాచారం అందింది. ఎన్నికల ఏడాది కావడంతో ‘ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌’ సమావేశాలుగా వీటిని నిర్వహించనున్నారు. ఐదో తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. సమావేశాల ప్రారంభం నాడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే అవకాశంఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతికి సంతాపంగా 31వ తేదీన రెండు సభలూ వాయిదా పడే అవకాశముంది.

SHARE

LEAVE A REPLY