ఏపీలో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై ఉత్తర్వులు!!

0
27

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒రాష్ట్రంలో 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా 56 బీసీ కార్పొరేషన్లు పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతకొంతకాలంగా దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 18న ఆయా కులాల వారీగా కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్లను వెల్లడించనుంది.

SHARE

LEAVE A REPLY