అన్న బాటలోనే తమ్ముడు కూడా…!!

0
79

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒తమిళ స్టార్ హీరో సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది . సూర్య సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతూ వస్తున్నాయి .. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ మధ్య వచ్చిన ‘బందోబస్తు’ సినిమా సైతం భారీ నష్టాలనే మిగిల్చింది. వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్న కూడా సూర్య క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. తాజాగా సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా ప్రేక్షలుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడు అన్నబాటలోనే వెళుతున్నాడు తమ్ముడు కూడా. సూర్య సోదరుడు కార్తీ కూడా ఓటీటీ బాటలోనే వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ కోడైకూస్తోంది. కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఏ సినిమాను కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీల్ సెట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది . ముందు ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసి ఆతర్వాత ఓటీటీ లో విడుదల చేయనున్నారట. మరి అన్నాతమ్ముళ్ల సినిమాలు ఎలా ఆకట్టుకుంటాయి చూడాలి.

SHARE

LEAVE A REPLY