ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !!

0
32

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒డిగ్రీ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు బీఎస్సీ చదవాలంటే ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే ఇంటర్‌ పాసయితే చాలు.  ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, అటానమస్‌ డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్స్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీలో 85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు కేటాయించనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా రిజర్వేషన్‌ విధానం అమలు కానుంది.

SHARE

LEAVE A REPLY