అమ్మవారి ఆలయం కూల్చివేత.. గ్రామంలో కలకలం!!

0
84

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఓ వైపు జాతర ఏర్పాట్లు సాగుతూ ఉండగానే ఈ ఘటన జరగడం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలనే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక వ్యక్తి జేసిబీతో వచ్చి ఈ ముఖద్వారాన్ని పడగొట్టేశాడని.. ఆ పడగొట్టిన విషయాన్ని అక్కడ స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వెంటపడి పట్టుకోవటానికి ప్రయత్నించినప్పటికి జేసిబీతో అతడు వేగంగా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానికులు వెల్లడిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగడంతో అంతటా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అమ్మవారి ఆలయంలో మరికొన్ని రోజులలో జాతర జరగనుంది. ఈ జాతరను గ్రామస్థులు చాలా ఘనంగా చేస్తుంటారని తెలుస్తోంది. ఆ ఆలంయంలో అమ్మవారిని ఊరివాళ్లంతా గ్రామదేవతగా భావిస్తారు.

SHARE

LEAVE A REPLY