డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఆర్కే ఫిర్యాదు

0
98

Times of Nellore (Amaravati)  # కోట సునీల్ కుమార్ #- ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. ఠాకూర్‌ అ‍ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అనంతరం రామకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… ‘ ఠాకూర్‌ డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరు. ఆయనపై నేను వేసిన పిల్‌ పెండింగ్‌లో ఉండగానే సీఎం.. ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి సమయంలోనూ సానుభూతి కోసం దాడి చేయించుకున్నారంటూ డీజీపీ చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఈసీ ఫిర్యాదులో పేర్కొన్నా’ అని వ్యాఖ్యానించారు.

SHARE

LEAVE A REPLY