ఓటు హక్కు వినియోగించుకొనేందుకే

0
115

Times of Nellore (Hyderabad)# కోట సునీల్ కుమార్ # : ఓటు హక్కు వినియోగించుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో పలు ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు పలు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయి పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ యాజమాన్యం అప్పటికప్పుడు సమావేశమై పరిస్థితి సమీక్షించి కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రోజూ తిరిగే 3500 బస్సులకు అదనంగా మరో 1200 బస్సులు వేసినట్టు ఆర్టీసీ ప్రకటించింది. కానీ ఈ బస్సులు మాత్రం తమకు ఎంతమాత్రం సరిపోవడంలేదని, గంటలపాటు తాము ప్రయాణ ప్రాంగణాల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిటీ బస్సులను కూడా కరీంనగర్‌, వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల బోర్డులు పెట్టి నడుపుతున్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు వేసే ఆర్టీసీ యాజమాన్యం ఐదేళ్ల కోసారి వచ్చే ఎన్నికల సమయంలో బస్సులు వేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా బస్సు ప్రాంగణాల్లో ఎక్కడ చూసినా యువతే కనబడుతోంది. ఓట్లు వేసేందుకు వారు ఉత్సాహంతో ఊళ్లకు వెళ్తున్నారు

SHARE

LEAVE A REPLY