నేటి నుంచి అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ మహిళల టోర్నీ

0
100

Times of Nellore (విజయవాడ)# కోట సునీల్ కుమార్ #: అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ మహిళల టోర్నీకి నగరంలోని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ముస్తాబైంది. కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి జరగనున్న టోర్నీలో దేశంలోని 84 యూనివర్సీటీలకు చెందిన జట్లు పాల్గొననుండగా, ఇప్పటికే 45 వర్సిటీజట్లు ఇక్కడకు చేరుకున్నాయి. బాల్‌ బాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీబీఎఫ్‌ఐ) నిబంధనలకు అనుగుణంగా నాలుగు కోర్టులను నిర్వాహకులు సిద్దం చేశారు. ఇందులో రెండింటిని ప్రాక్టీస్‌కు కేటాయించారు. పోటీలు తొలి మూడు రోజులూ నాకౌట్‌ కమ్‌ లీగ్‌ పద్ధతిలోనూ, చివరి రెండు రోజులు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఎస్‌డీఎం సిద్ధార్థ ఇండోర్‌ స్టేడియంలో జరిగే పోటీల ఏర్పాట్ల గురించి పలు వర్సిటీల టీమ్‌ మేనేజర్లు, కోచ్‌లతో వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం సమీక్షించారు. ప్రతి రోజు మ్యాచ్‌లను 7.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని, టెక్నికల్‌ అధికారులు, పీడీలు పారదర్శకంగా పోటీలను నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. టోర్నీకి విచ్చేసిన వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని వివరించారు. ఈ సమావేశంలో టోర్నీ డైరెక్టర్‌ వి.రవికాంత, డైరెక్టర్‌ ఆర్‌.రఘువరన్‌, ట్రెజరర్‌ మురళీ కృష్ణ, చీఫ్‌ రిఫరీలు, పీడీలు పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలకు మంత్రులు గంటా శ్రీవాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కేంద్ర యువజన, క్రీడల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.దమయంతి, ఏపీ బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఆర్‌.వెంకట్రావు హాజరవుతారు.

SHARE

LEAVE A REPLY