అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..!!

0
153

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే రూ.150 పై మాటే ఖర్చవుతుంది. అలాగే చిన్న హోటళ్లలో అయితే రూ.70 నుంచి రూ.100 ఉంటుంది. కానీ చెన్నైలోని ఓ హోటల్‌లో కేవలం రూ.10కే ప్లేట్ భోజనం, రూ.30కే ఫుల్ మీల్స్ లాగించేయవచ్చు. అదీ కూడా అక్కడ సిబ్బంది ఏసీ గదిలో వడ్డిస్తారు. రజనీకాంత్ అభిమాని ఒకరు చెన్నైలోని సాలి గ్రామంలో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.

స్థానిక కార్మికులకు, రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే రేట్లతో స్టార్ హోటళ్లకు ధీటుగా అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగను వడ్డిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో ఈ హోటల్ కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండటంతో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడికి భోజనానికి వెళ్తున్నారు. ఇక ఆ హోటల్ యజమాని వీరబాబు మాట్లాడుతూ కేవలం సేవా దృక్పధంతోనే ఈ హోటల్‌ను పెట్టామని స్పష్టం చేశాడు. కాగా, రజనీకాంత్ వీరాభిమానులు మరికొందరు ఇలాంటి హోటల్స్‌ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది.

SHARE

LEAVE A REPLY