ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 84 ఏసీ బస్సులు

0
59

Times of Nellore (Amaravati) # కోట సునీల్ కుమార్ # – రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) కొత్తగా 84 ఏసీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిల్లో ఏసీ సీటర్‌ విభాగంలో 48 ఇంద్ర బస్సులు, 4 అమరావతి బస్సులు.. ఏసీ సీటర్‌+స్లీపర్‌ విభాగంలో నైట్‌ రైడర్‌ పేరుతో తిప్పేందుకు వీలుగా 12 బస్సులు, ఏసీ స్లీపర్‌ విభాగంలో 20 వెన్నెల బస్సులు ఉంటాయి. వెన్నెల బస్సుల్లో ఇప్పటికే 10 సంస్థ గూటికి చేరాయి. ఈ పది బస్సుల్లో విజయవాడ రీజియన్‌ పరిధిలోని విజయవాడ-హైదరాబాద్‌, విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు మార్గంలో రెండు చొప్పున ఆరింటిని నడపనున్నారు. విశాఖ రీజియన్‌ పరిధిలోని విశాఖపట్నం-హైదరాబాద్‌ మార్గంలో రెండింటిని, తిరుపతి రీజియన్‌ పరిధిలోని తిరుపతి-హైదరాబాద్‌ మార్గంలో మరో రెండింటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ఏసీ స్లీపర్‌ బస్సులు 30 బెర్తులను కలిగి ఉంటాయి. 2+1 తరహాలో రూపొందించారు. వీటిల్లో ప్రయాణికుడి బెర్త్‌ పక్కనే లగేజీ క్యారియర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

SHARE

LEAVE A REPLY