గ్రామ సచివాలయాల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే..!

0
100

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒– గ్రామ/వార్డ్ సచివాలయాల్లోని 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన పోస్టులను మాత్రం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయబోతున్నారు. 4 వ తరగతి నుండి 7వ తరగతి వరకు నాలుగేళ్ళపాటు ఏ జిల్లాలో అభ్యర్థులు చదువుకొని ఉంటారో ఆ జిల్లానే అభ్యర్థి యొక్క స్థానిక కేటగిరీ అవుతుంది.

ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో ధరఖాస్తు చేసుకుంటే మాత్రం ఆ అభ్యర్థిని ఓపెన్ కేటగిరీ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రామ/ వార్డ్ సచివాలయాల్లోని ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాలు వయో పరిమితిగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో ఐదేళ్ళ సడలింపు అమలు చేస్తారు. రాత పరీక్ష ద్వారా ఎంపికయిన అభ్యర్థులకు 15 వేల రుపాయల గౌరవ వేతనం ఉంటుంది.

నిన్న ఉదయం 11 గంటల నుండే ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ధరఖాస్తు చేయటానికి మూడు వెబ్ పోర్టల్స్ అందుబాటులో ఉంచారు. గ్రామ/ వార్డ్ సచివాలయాల్లో పంచాయితీ కార్యదర్శీ, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ 2),ఏ ఎన్ ఎం, పశు సంవర్థక శాఖ సహాయకుడు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ హార్డికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ఉద్యోగాలు ఉంటాయి.

వీటితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎనిమిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ రెగ్యూలేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సెక్రటరీ ఉద్యోగాలు ఉంటాయి. ఆగష్ట్ 10 వ తేదీని ధరఖాస్తు చేయటానికి చివరి తేదీగా నిర్ణయించారు.

SHARE

LEAVE A REPLY