ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు సుఖాంతం

0
38

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు సుఖాంతమైంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఏపీ పోలీసులు బెంగళూరులో గుర్తించారు. తమను వెతకవద్దంటూ తల్లికి మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయారు. విశాఖ నుంచి చెన్నై.. చెన్నై నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు యువతులను బెంగళూరులో గుర్తించారు. అక్కడ నుంచి విశాఖకు తీసుకొస్తున్నారు. ముగ్గురు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అసలు ముగ్గురు ఇంట్లోనుంచి ఎందుకు వెళ్లిపోయారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY