11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు

0
186

Times of Nellore ( Hyderabad ) – మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై నిన్న అసెంబ్లీలో జరిగిన దాడిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శాసనసభాపతి మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌లపై సస్పెన్షన్‌వేటు వేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలు రద్దు చేశారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ బహిష్కరణ ఉంటుందని స్పీకర్‌ ప్రకటించారు.

అనంతరం సస్పెండైన సభ్యులు సభను వీడాలని స్పీకర్‌ కోరారు. మండలి ఛైర్మన్‌పై జరిగిన దాడి చూసి తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చగా నిలిచిపోతుందని అన్నారు. అంతకుముందు సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండించారు. సమావేశాలు ముగిసేవరకూ కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు..

SHARE

LEAVE A REPLY