వెస్టిండీస్‌ టూర్‌ లో టీమిండియా తొలి సమరం నేడే!

0
142

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ – వరల్డ్‌ కప్‌ తర్వాత మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉన్న టీమ్‌ ఇండియా.. మళ్లీ సమరానికి సిద్ధమైంది. వెస్టిండీస్‌ టూర్‌ లో తొలి సమరం నేడే కావడంతో.. సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా విండీస్‌ కు వెళ్లింది. తన టూర్‌ ను టీ – 20 మ్యాచ్‌ తో ప్రారంభించనుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. ఇప్పటికే జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేసింది. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు విండీస్‌ పర్యటనలో భాగంగానే.. 2016 లో రెండు టీ 20లు ఆ దేశంలో ఆడిన టీమ్‌ ఇండియా.. ఈసారీ అక్కడే రెండు మ్యాచ్‌లాడుతోంది. టీ 20 ల్లో వెస్టిండీస్‌ ప్రపంచ ఛాంపియన్‌. ప్రపంచ వ్యాప్తంగా టీ 20 లీగ్‌ల్లో హవా సాగించే విండీస్‌ స్టార్లు.. అంతర్జాతీయ టీ 20 ల్లోనూ అదరగొడుతుంటారు. కాబట్టి సిరీస్‌ భారత్‌కు సవాలే అంటున్నారు విశ్లేషకులు.

SHARE

LEAVE A REPLY