వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ విజేత విజయవాడ

0
230

Times of Nellore (Anantapur) # కోట సునీల్ కుమార్ # – అనంతపురం లోని ఆర్ డి టి గ్రౌండ్ లో జరుగుతున్న ఫాదర్ విన్సెన్ట్ ఫెర్రర్ అంతర్ రాష్ట్ర వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ లో సోమవారం గుంటూరు ,హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ జట్టులోని స్వరూప్ 29 ,గిరి 26 పరుగులు చేయగా, గుంటూరుకు చెందిన శరత్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగింది గుంటూరు జట్టు 12 .1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి విజయం సాధించింది. గుంటూరు జట్టులోని మనోజ్ 66 ,రమేష్ 52 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ లో గుంటూరు జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయవాడ ,గుంటూరు జట్లు తలపడ్డాయి.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయవాడ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 149 పరుగులు చేసింది.ఈ జట్టులోని జనార్దన్ 33 ,శ్రీకాంత్ 24 ,బాబు 23 ,లెనిన్ 22 పరుగులు చేయగా గుంటూరు జట్టులోని మనోజ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుంటూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.ఈ జట్టులోని హరి 37 ,రమేష్ 32 ,మనోజ్ 32 పరుగులు చేయగా,మని 2 వికెట్లు పడగొట్టాడు. విజయవాడ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం తో విజయవాడ జట్టు వెటరన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా అక్కులయ్య, బాలసుబ్రమణ్యం, స్కోరర్ గా నరేంద్ర వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY