చెన్నై, ముంబై జట్లు గెలుపుపై హీరో వెంకటేష్ జోస్యం

0
294

Times of Nellore (Hyd) –  హీరో వెంకటేష్ ఈ పేరు పరిచయం చేయనక్కర లేని పేరు. ఆయనకు సినిమాలు అంటే ఎంత ప్రేమో. క్రికెట్ అంటే అంతే మక్కువ. తరుచుగా క్రికెట్ స్టేడియాల్లో సందడి చేసే ఏకైక నటడు వెంకటేషే. ఐపీఎల్‌ను మొదటి నుంచి వెంకటేష్ క్షుణంగా పరిశీలిస్తున్నారు. చెన్నై, ముంబై ఇండియన్‌కు ఎవరికి ఎక్కువ విజయావకాశాలున్నాయన్న దానిపై ఆయన స్పందించారు. ‘‘చెన్నై, ముంబై జట్లు ఫైనల్‌కు రావడం అందరూ ఊహించిందే. నిజానికి ఐపీఎల్‌లో అవి రెండూ బలమైన జట్లు. అయితే టీ-20 లాంటి ఆటల్లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం. ఈ రెండు జట్లూ అనేక సార్లు ఫైనల్‌కు వచ్చాయి. అయితే చెన్నైకి ధోని నాయకత్వం అనేది కొంత ఉపకరిస్తుందని అనుకుంటున్నాను. పైగా ఆ జట్టులో అందరూ దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. అలా అని ముంబైని తక్కువగా అంచనా వేయలేం. మెల్లిగా వారి ఆటను ప్రారంభించి ఫైనల్ వరకు వచ్చారు. వారికి కూడా విజయావకాశాలు ఎక్కువే ఉన్నాయి’’ అని అన్నారు.

SHARE

LEAVE A REPLY