ప.గో జిల్లా అండర్ 19 జట్టు నెల్లూరు పర్యటన

0
437

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ # – వెంకటగిరి తారకరామ క్రీడమైదానంలో జరుగుతున్న అండర్ 19 మ్యాచ్ లో భాగంగా ప.గో. జట్టు 180 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నేడు తిరిగి అట ప్రారంభించి తన మొదటి ఇన్నింగ్స్ లో 342 పరుగులు సాధించింది. ఈ జట్టులోని జస్వంత్ 54 , సుజన్ 74 పరుగులు చేసారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో నెల్లూరు జట్టు అట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నెల్లూరు జట్టు లోని సాయి శ్రీ చరణ్ రెడ్డి 105 పరుగులు, ఫర్హాద్ ఖాద్రి 53 పరుగులు చేసారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. కానీ మొదటి ఇన్నింగ్స్ లో ప.గో జట్టు 229 లీడ్ సాధించడం విశేషం. ఈ పర్యటనలో ప.గో జట్టు రెండు టెస్ట్ మ్యాచ్ లు, ఒక వన్ డే మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కు అంపైర్ లుగా రాంగోపాల్,చిట్టిబాబు ,స్కోరర్ గా సి డి శ్రీనివాస్ వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY