వెంకటగిరి లో అండర్ 12 ఫ్యూచర్ కప్ క్రికెట్ పోటీలు

0
194

Times of Nellore (Venkatagiri) # కోట సునీల్ కుమార్ #- ఎస్ మోహన్ కృష్ణ మెమోరియల్ అండర్ 12 ఫ్యూచర్ కప్ అంతర్ జిల్లా సౌత్ జోన్ క్రికెట్ పోటీలు ఈ రోజునుండి ప్రారంభమయ్యాయి.వేంకటగిరి లో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అద్వర్యం లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ నేటి నుండి 11 వరకు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో నెల్లూరు,కడప,కర్నూల్,అనంతపూర్, చిత్తూరు జిల్లాలు పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు – కడప, కర్నూల్ – అనంతపూర్ జట్లు తలపడ్డాయి. కడప జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 70 పరుగులు సాధించింది. చైతన్య 31 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కడప జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప ఆటగాళ్లు గురునివేశ్ -26 , ప్రణవ్ -25 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. కడప బౌలర్ అశ్రోఫ్ 3 వికెట్లు తీసాడు.

కర్నూల్, అనంతపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కర్నూల్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో, 24 .1 ఓవర్లకు 50 పరుగులు చేసి అల్ అవుట్ అయింది . అనంతరం బ్యాటింగ్ కు దిగిన అనంతపూర్ జల్లు 51 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 10 . 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. విజయం సాధించిన జట్లు 4 పాయింట్లు సాధించారు.

స్టేట్ కోచ్ సి డి థామస్, సౌత్ జోన్ చీఫ్ కోచ్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణ లో జరుగుతున్నా ఈ టోర్నమెంట్ ను నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ డి శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, సెలెక్టర్ హరీష్ పర్యవేక్షించారు. అంపైర్ లు గా చిట్టిబాబు, రాంగోపాల్,శ్రీనివాస్,షఫీఉల్లా వ్యవహరించారు.

SHARE

LEAVE A REPLY