టీమిండియా ఘోర పరాజయం.. సిరీస్ ఆసీస్ సొంతం

0
324

Times of Nellore (Delhi)# సూర్య # – ఆసీస్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌ను 2-3తో ఆసీస్ కైవసం చేసుకుంది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ(55), కేదార్ జాదవ్(44), భువనేశ్వర్ కుమార్(46) పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ సేన సిరీస్ చేజార్చుకుంది. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు, కమిన్స్, రిచర్డ్స్, స్టోయిన్స్ చెరో రెండు వికెట్లు, లియాన్ ఒక వికెట్ తీసుకున్నారు.

SHARE

LEAVE A REPLY