ధోనీ అరుదైన రికార్డు.. భారత్ నుంచి ఒకే ఒక్కడు!

0
244

Times of Nellore (Hamilton) # సూర్య # – న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బరిలోకి దిగడం ద్వారా టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరపున అత్యధిక టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తాజా మ్యాచ్ ధోనీకి 300వది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 11 మంది ఆటగాళ్లు ఈ ఘనత సాధించగా ఇప్పుడు ధోనీ వారి సరసన చేరాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించింది మాత్రం ధోనీ ఒక్కడే.

భారత్ తరపున 95 టీ20లు ఆడిన ధోనీ ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినవే 185 మ్యాచ్‌లున్నాయి. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరపున 20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ జట్టు మనుగడలో లేదు. ఇప్పటి వరకు టీ20ల్లో 24 అర్ధ సెంచరీలు చేసిన ధోనీ 38.57 సగటుతో 6,134 పరుగులు చేశాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన వారిలో విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 446 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ధోనీ తర్వాత 298 టీ20లతో రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

SHARE

LEAVE A REPLY