నా కెరీర్ మారడానికి కారణం అతడే: పుజారా

0
57

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- రాహుల్ ద్రవిడ్‌తో తనను పోల్చడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని టెస్ట్ ప్లేయర్ పుజారా అన్నాడు. ద్రవిడ్‌ పైన తనకు ఉన్న అభిమానాన్ని ఒక్క మాటలో చెప్పలేనని, ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చకున్నానని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుజారా ద్రవిడ్ గురించి అనేక విషయాలను వివరించాడు. ‘నేను క్రికెట్‌లో ఈ స్థాయిలో రానించడానికి ద్రవిడ్ కూడా ఓ కారణం. ఆయన సలహాలు, సూచనలు నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆట ఒత్తిడి నుంచి బయటకు ఎలా రావాలి.. వ్యక్తిగత, క్రీడా జీవితాలను వేరువేరుగా ఎలా చూడాలి.. అనే విషయాలు ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తుపై అవగాహన కలుగుతుంద’ని పుజారా చెప్పుకొచ్చాడు. ఆటపై ఎక్కువగా దృష్టి సారించాలని చాలా మంది తనకు చెబుతుంటారని, అయితే తాను ఆటను ఎప్పడూ తక్కువ చేయలేదని, దాని ఒత్తిడి తనపై లేకుండా చూసుకుంటానని పుజారా చెప్పుకొచ్చాడు. ఈ ఆలోచనా విధానం ద్రవిడ్ నుంచే తాను నేర్చుకున్నానని పేర్కొన్నాడు.

SHARE

LEAVE A REPLY